
కన్నతల్లి కోరిక మేరకు 71 ఏండ్ల వయసులో నీట్ పరీక్షకు హాజరు..!
లక్నోకు చెందిన 71 ఏళ్ల అశోక్ బహార్, తన తల్లి కోరిక మేరకు డాక్టర్ కావాలనే కలతో నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించి విఫలమైన ఆయన, 20 మంది వైద్యులున్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన భార్య మంజు బహార్ ఒక గైనకాలజిస్ట్. జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో మరోసారి పరీక్షకు హాజరైనట్లు ఆయన వెల్లడించారు.




