ఇరాన్ రాయబార కార్యాలయం వివాదాస్పద పిలుపుతో బ్రిటన్ ఆగ్రహం

8244చూసినవారు
ఇరాన్ రాయబార కార్యాలయం వివాదాస్పద పిలుపుతో బ్రిటన్ ఆగ్రహం
బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం, తమ మాతృభూమి కోసం 'ప్రాణత్యాగానికి సిద్ధం కావాలి' అంటూ 'జాన్ ఫదా' పేరుతో వివాదాస్పద ప్రచారాన్ని ప్రారంభించింది. దేశాన్ని శత్రువుకు అప్పగించే కంటే యుద్ధంలో ప్రాణత్యాగం చేయాలని సందేశంలో పేర్కొంది. ఈ చర్యపై యూకే ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, ఇరాన్ రాయబారి సయ్యద్ అలీ మూసవీకి సమన్లు జారీ చేసి వివరణ కోరింది. బ్రిటన్ గడ్డపై ఉంటూ ఇలాంటి సందేశాలు ఇవ్వడం దౌత్య నిబంధనలకు విరుద్ధమని బ్రిటన్ అధికారులు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్