
వేధింపులు భరించలేక.. యువకుడిని చున్నీతో ఉరేసిన మహిళ
TG: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం చోటుచేసుకుంది. తనను నిరంతరం వేధిస్తున్న సాయినాథ్ సింగ్ (26) అనే యువకుడిని ఓ వివాహిత చున్నీతో ఉరేసి హతమార్చింది. కుటుంబం ఉందని చెప్పినా వినకుండా వేధిస్తుండటంతో, భర్త, కుటుంబ సభ్యులు హెచ్చరించినా అతడి తీరు మారలేదు. విసిగిపోయిన ఆ మహిళ, అతడిని పుట్టింటికి పిలిపించి చున్నీతో ఉరివేసి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.




