
భూకంపం వచ్చిందనుకున్నా: ప్రత్యక్ష సాక్షి
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై స్థానికుడు ఒకరు తమ అనుభవాన్ని పంచుకున్నారు. పేలుడు సంభవించినప్పుడు వచ్చిన భారీ శబ్దానికి భూకంపం వచ్చిందేమోనని భావించినట్లు ఆయన తెలిపారు. పేలుడు ధాటికి మూడుసార్లు కుర్చీ నుంచి కింద పడిపోయానని, దీంతో భయపడి షాపు మూసి బయటకు వచ్చినట్లు చెప్పారు. పేలుడు జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే తన దుకాణం ఉందని ఆయన పేర్కొన్నారు.




