AP: నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా కార్డెన్స్ సెర్చ్ నిర్వహించారు. అయితే పోలీసులు తనిఖీలు చేస్తుండగా సురేశ్ అనే వ్యక్తి తన బైక్ను ఇంటికి దూరంగా మరో వీధిలోకి తీసుకెళ్లి పెట్టాడు. అది గమనించిన సురేశ్ కొడుకు మహేంద్ర(6) పోలీసుల వద్దకు వెళ్లి తన తండ్రి బైక్ దాచిపెట్టిన విషయాన్ని చెప్పాడు. బైక్ దాచిపెట్టిన చోటుకు పోలీసులను తీసుకెళ్లి చూపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.