కరోనాకు ఆరేళ్లు.. సరిగ్గా ఇదే రోజు ఎంట్రీ

1చూసినవారు
కరోనాకు ఆరేళ్లు.. సరిగ్గా ఇదే రోజు ఎంట్రీ
డిసెంబర్ 31, 2019న ప్రపంచం నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుండగా, చైనాలోని వూహాన్‌లో కోవిడ్-19 మహమ్మారి పురుడు పోసుకుంది. 21వ శతాబ్దపు అత్యంత వినాశకరమైన ఈ వైరస్, లక్షలాది మంది ప్రాణాలను బలిగొని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుంగదీసింది. మార్చి 2020 నాటికి దేశాలు సరిహద్దులు మూసివేసి, లాక్‌డౌన్‌లు విధించాయి. భారతదేశం కూడా మార్చి 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించి, ఆసుపత్రులు, పరీక్షలు, ఆక్సిజన్ సరఫరాను బలోపేతం చేసుకుంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పింది.

సంబంధిత పోస్ట్