దగ్గు మందు కలకలం.. 14కు చేరిన మరణాలు

16028చూసినవారు
దగ్గు మందు కలకలం.. 14కు చేరిన మరణాలు
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి 14 మంది చిన్నారులు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన మరికొన్ని పరిణామాలు శని, ఆదివారాల్లో చోటు చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు నిర్లక్ష్యం వహించాడని పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మరణాలకు కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ దగ్గు సిరఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సిరప్‌లో అత్యంత విషపూరితమైన పదార్థం ఉన్నట్లు నమూనాల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్