తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు మందుతో చిన్నారులు మరణించిన నేపథ్యంలో, TN-FDA తక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని కేంద్రం ప్రశ్నించింది. CDSCO సిఫార్సులు, DCGI ఆదేశాలు ఉన్నప్పటికీ క్రిమినల్ కేసులు పెట్టకపోవడం, లైసెన్స్ రద్దు చేయకపోవడం కేంద్రాన్ని ఆందోళనలో పెడుతోంది. తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్, ఇప్పటికే రాష్ట్రం తక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.