నేటి నుండి మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభం

0చూసినవారు
నేటి నుండి మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభం
TG: మేడారం మహాజాతరలో భక్తులు సమర్పించిన హుండీల లెక్కింపు నేటి నుండి హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ప్రారంభం కానుంది. ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం నుండి హనుమకొండకు 827 హుండీలను తరలించారు. హుండీ లెక్కింపునకు 15 రోజులకు పైగా పట్టే అవకాశం ఉంది. గత జాతరలో రూ.15 లక్షలకు పైగా ఆదాయం రాగా, ఈసారి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కింపులో 100 మంది సిబ్బంది పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్