పాకిస్తాన్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో మొహమ్మద్ సాహిల్, అతడి భార్య సమీరను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సరాయ్ కాలే ఖాన్‌లో నివసించే సాహిల్ 2024 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్ ఐఎస్‌ఐతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పాక్ ఏజెంట్ల ఆదేశాలతో 8 సిమ్ కార్డులను దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు పంపి, రూ.30 వేల నగదు పొందినట్లు వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో తిరిగి సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ కొనసాగిస్తున్నారు.