భూవివాదంతో సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

1చూసినవారు
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం వద్ద సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక దంపతులు తమ భూమి వివాదంలో స్థానిక అధికారులు, పోలీసులు న్యాయం చేయడం లేదనే ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, వారు అగ్గిపెట్టె వెలిగించే లోపే వారిని అడ్డుకుని, నీళ్లు పోసి ప్రాణాలు కాపాడారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్