శ్రీకాకుళం జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. కొత్తూరు మండలం చిన్నరాజపురం గ్రామంలో చేతబడి నెపంతో సవర ఇల్లంగి, జ్యోతి అనే దంపతులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణహత్యతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.