ఓ ప్రేమ జంట గ్రామస్తులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో, గ్రామస్తులు వారికి అక్కడే దండలు మార్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఆ వీడియోలో ఒక మహిళ యువతిని కొట్టడం కూడా కనిపిస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే స్పష్టత లేదు. @Firojbhai75 అనే యూజర్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి సంఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వీడియో పాతది అయినప్పటికీ ప్రస్తుతం వైరల్ అవుతోంది.