AP: విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఆదివారం విషాదం చోటే చేసుకుంది. సంగం ఆఫీస్ సమీపంలోని ఒక ఇంట్లో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న భార్య ఏడు నెలల గర్భిణీ కాగా, వారికి ఏడాది క్రితమే వివాహం జరిగింది. గర్భిణీ కడుపులో ఉన్న బిడ్డ బతుకుతాడేమో అని ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.