ఎలుకల మందు తిని చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య

57చూసినవారు
ఎలుకల మందు తిని చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య
AP: బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామంలో బుధవారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన లావు విఘ్నేష్ (22), ఓ 15 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరిద్దరూ, బుధవారం ఉదయం కోనంకి గ్రామ చెరువు వద్దకు చేరుకున్నారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, ఎలుకల మందు తిని చెరువులో దూకారు. స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్