MPలోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ స్పై కెమెరా బ్లాక్‌మెయిలింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రేమ జంట భూపేంద్ర ధాకడ్, రాధా చౌబే సోమవారం సాంక్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు భూపేంద్ర సోషల్ మీడియాలో నాలుగు వీడియోలను అప్‌లోడ్ చేశాడు. తమ కుటుంబ సభ్యుల వేధింపులు, బంగారం దొంగతనం చేశారనే తప్పుడు ఆరోపణల వల్లే తాము చనిపోతున్నట్లు ఆ వీడియోలలో పేర్కొన్నారు.