
ఒకే జిల్లాలో 7400 మందికి HIV పాజిటివ్ (వీడియో)
ప్రభుత్వాలు ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపట్టినా, హెచ్ఐవీ–ఎయిడ్స్ గురించి ప్రజల్లో సరైన అవగాహన ఇంకా పుష్కలంగా పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఇంకా నియంత్రణలోకి రాలేదు. తాజాగా బీహార్లోని సీతామఢీ జిల్లాలో పరిస్థితి మరింత గంభీరంగా మారింది. అక్కడ మొత్తం 7,400 మందికి పైగా హెచ్ఐవీ సోకినట్టు వచ్చిన అధికారిక వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీరిలో దాదాపు 400 మంది చిన్నారులు ఉండటం మరింత బాధాకరం. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




