నెలకు 3 లక్షల జీతం.. పిల్లల్ని కనే సాహసం చేయలేమన్న దంపతులు

9351చూసినవారు
నెలకు 3 లక్షల జీతం.. పిల్లల్ని కనే సాహసం చేయలేమన్న దంపతులు
గుర్గావ్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల దంపతులు, నెలకు రూ.3 లక్షలు, ఏడాదికి రూ.36 లక్షలు సంపాదిస్తున్నారు. అయినా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పిల్లలను కనే సాహసం చేయలేమని తేల్చి చెప్పారు. సొంత ఇల్లు కొనే స్థోమత లేదని, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారంగా మారాయని వారు వాపోయారు. రియల్ ఎస్టేట్ ధరలు, విద్యా ఖర్చుల భారం మోయలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంధువు హర్ష్ గుప్తా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్