కొడుకు కుటుంబంతో సరదాగా గడిపేందుకు వెళ్లి.. దంపతులు మృతి

131చూసినవారు
కొడుకు కుటుంబంతో సరదాగా గడిపేందుకు వెళ్లి.. దంపతులు మృతి
AP: ఎన్టీఆర్(D) వీరులపాడు(M) గోకరాజుపల్లికి చెందిన పంచుమర్తి శేషగిరిరావు, అనసూయ దంపతులు. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో స్థిరపడిన కుమారుడు శ్రీనివాస్ కుటుంబంతో సరదగా గడిపేందుకు దంపతులు అక్కడికి వెళ్లారు. అక్టోబర్ 4న బంధువుల ఇంటికి వెళ్లేందుకు కోడలు మౌనిక, మనవడు దేవాన్ష్‌తో శేషగిరిరావు దంపతులు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో వాహనం ఢీకొట్టడంతో శేషగిరిరావు దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 19న మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్