వేగంగా వెళ్తున్న రైలు పక్కన రీల్స్ చేసిన జంట.. వైరల్

32చూసినవారు
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇటీవల, ఓ రైల్వే వంతెనపై వేగంగా వెళ్తున్న రైలు పక్కన వీడియో చేసిన ఓ జంట తీరు నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. కాలు జారినా, గట్టిగా గాలొచ్చినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నా.. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపులారిటీ కోసం ఇంత రిస్క్ అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.