ఇటీవల కాలంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ జంటలు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా గుజరాత్‌లోని వడోదర నగరం యునైటెడ్ వే గర్బా గ్రౌండ్‌లో ఒక ప్రేమ జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకుంది. ఇన్‌స్టా రీల్ కోసం ఇలా ఆ ప్రేమికులు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరి ముందే బహిరంగా వారు ఇలా చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతూ కామెంట్లు పెడుతున్నారు.