
భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ.. వీడియో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్, రన్‌వే నుంచి తొలి విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారైంది. దేశంలోనే అధునాతనంగా రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతంకు పైగా పూర్తయ్యాయి. 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్‌వేతో ఈ విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్ పోర్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.




