లిపిస్టిక్‌తో గోడపై మెసేజ్‌... దంపతులు అనుమానాస్పద మృతి

17500చూసినవారు
లిపిస్టిక్‌తో గోడపై మెసేజ్‌... దంపతులు అనుమానాస్పద మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అటల్ ఆవాస్ కాలనీలో శివాని తండే అలియాస్‌ నేహా, రాజ్ దంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మొదట భార్యాభర్తల వివాదంగా భావించినా, లిప్‌స్టిక్‌తో గోడలపై రాసిన సందేశం హత్య లేదా ఆత్మహత్య అనే అనుమానాలను రేకెత్తించింది. నేహా మంచంపై, రాజ్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్