తెలంగాణలో షాకింక్ ఘటన చోటుచేసుకుంది. మొంథా తుఫాన్ కారణంగా జనగామ జిల్లాలో వరదలు పోటెత్తడంతో, మత్తడిని దాటేందుకు ప్రయత్నించిన ప్రేమ జంట బైక్‌తో సహా వరదల్లో కొట్టుకుపోయింది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తిమ్మంపేట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య అనే యువతీ యువకులు బైక్‌పై వెళ్తుండగా, బోళ్ల మత్తడి ప్రవాహంలో పడిపోయారు. శివకుమార్ చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడగా, శ్రావ్య నీటిలో కొట్టుకుపోయింది.