యూపీలోని ఝాన్సీలో షాకింగ్ ఘటన జరిగింది. "గణేశ్ జువెలర్స్" దుకాణంలో రూ. 50 వేల విలువైన బంగారు ఉంగరాన్ని ఒక జంట చోరీ చేసింది. ఉంగరాలు లెక్కించినప్పుడు ఒకటి తక్కువగా ఉండటంతో యజమాని హర్షిత్ అగర్వాల్‌కు అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆ మహిళ ఉంగరాన్ని దొంగిలించడం స్పష్టంగా కనిపించింది. ఈ జంట ఉంగరం కొనడానికి వచ్చినట్లు నటించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.