ఏపీ లిక్కర్ రవాణా కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి, రాజ్‌కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లను మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారులు రేపటి నుంచి ఈ మూడు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.