ప్రముఖ దర్శకుడు ఇళయరాజా, తాను స్వరపరిచిన రెండు పాటలను 'డ్యూడ్' చిత్ర బృందం అనుమతి లేకుండా ఉపయోగించుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సినిమా టీమ్ మరియు ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇళయరాజా సిద్ధమయ్యారు. దీనిపై ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.