హెచ్1బీ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజును
అమెరికా న్యాయస్థానం కొట్టేసింది. బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయం చట్ట విరుద్ధమని ప్రకటించింది.
అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపనందున దీనిని చట్ట విరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నామని, అది చెల్లదని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరొకిన్ సోమవారం తీర్పు చెప్పారు. ఇది పెనాల్టీ కాదని, పన్ను అని,
కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఈ పన్నుపై నిర్ణయం తీసుకోజాలరని జడ్జి స్పష్టం చేశారు..