
కదులుతున్న బస్సులో మంటలు.. 15 మంది సజీవదహనం (వీడియో)
రాజస్థాన్లోని జైసల్మేర్లో మంగళవారం ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 15 మంది సజీవదహనమయ్యారు. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 25 మంది గాయపడ్డారు. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమీపంలోని ఆర్మీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.




