
కుటుంబకలహాలు.. భార్యను హత్య చేసిన భర్త
TG: సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. నాగల్గిద్ద మండలం ఇరాక్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి భార్య ఇర్ఫానా (32)ను భర్త సయ్యద్ ముల్తాన్ హత్య చేశాడు. కత్తితో అతికిరాతకంగా పొడిచి చంపినట్లు సమాచారం. ఈ హత్య అనంతరం, మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సయ్యద్ ముల్తాన్ నాగల్గిద్ద పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.




