చిరుతతో పోరాడిన ఆవు (వీడియో)

38చూసినవారు
ఆవుపై దాడి చేసిన చిరుతకు చుక్కలు కనిపించాయి. ఆవు ప్రతిఘటించడంతో చివరికి చిరుత తోకముడిచి పారిపోయింది. దాంతో ఆవు ప్రాణాలు నిలిచాయి. ఈ ఆసక్తికరమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. చిత్తోర్‌గఢ్ జిల్లా ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్‌లోని కొలిపుర ప్రాంతంలో మేత కోసం ఓ ఆవు వచ్చింది. ఆవును చూసిన చిరుత దానిపై దాడి చేసింది. ఆవు ధైర్యంగా ఎదురుదాడి చేసింది. చివరికి చిరుత తోకముడిచి అడవిలోకి పారిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్