పదో తరగతి విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు (వీడియో)
TG: పదో తరగతి విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పరీక్ష ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఓటమిని సానుకూలంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఓటమి అనేది గెలుపుకు తొలి మెట్టేనని, అది జీవితానికి ముగింపు కాదని చెప్పారు. మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడిపి వారి భయాన్ని తొలగించాలని, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని వారికి భరోసా కల్పించాలని సూచించారు.