రిటైర్మెంట్ వేళ సీపీ సుధీర్ బాబు కన్నీళ్లు

4021చూసినవారు
రిటైర్మెంట్ వేళ సీపీ సుధీర్ బాబు కన్నీళ్లు
TG: సుదీర్ఘ పోలీస్ సేవ తర్వాత, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీ సుధీర్ బాబు బుధవారం పదవీ విరమణ చేశారు. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో జరిగిన వీడ్కోలు సభలో, తన 31 ఏళ్ల సర్వీసును గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. క్షేత్రస్థాయి సిబ్బంది కష్టమే రాచకొండ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను నంబర్ వన్ స్థానంలో నిలిపిందని, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని ఆయన అన్నారు. బాధ్యతగా పనిచేస్తే మంచి ఫలితాలు దానంతటవే వస్తాయని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్