TG: రాష్ట్రంలో పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్ 2025 ఫలితాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. సోమవారం అన్ని సబ్జెక్టుల ఫలితాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ వంటి పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. కాగా అభ్యర్థులు https://cpget.tgche.ac.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.