సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సీపీఐ నారాయణ ఆగ్రహం (వీడియో)

29చూసినవారు
సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ మాఫియా, ప్రభుత్వాలు కలిసి సామాన్య ప్రజలను లూటీ చేస్తున్నాయని మండిపడ్డారు. సినిమా యజమానులు టికెట్ ధరలు పెంచాలని అడగడం, ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వడం అత్యంత దారుణమన్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీయమని ఎవరూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్