సీజేఐపై దాడి యత్నాన్ని ఖండించిన సీపీఐ నారాయణ (VIDEO)

10122చూసినవారు
సీజేఐపై దాడి ప్రయత్నాన్ని సీపీఐ నారాయణ తీవ్రంగా ఖండించారు. “ఇది రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి” అని ఆయన అన్నారు. అత్యున్నత న్యాయస్థానంలోనే సీజేఐకి రక్షణ లేకపోతే దేశం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం కాలం చెల్లిందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీజేఐపై దాడి జరగడం దారుణమని అన్నారు. సనాతనంపై తరచూ మాట్లాడే పవన్ కళ్యాణ్‌ దీనిపై ఆలోచించి, జస్టిస్ గోవాయ్‌పై దాడిని ఖండించాలని నారాయణ డిమాండ్‌ చేశారు.