సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

10చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని బృందం మంగళవారం కలిసింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీఎం కోరగా, సీపీఐ నాయకులు సానుకూలంగా స్పందించారు. పార్టీతో చర్చించి త్వరలోనే తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని కూనంనేని బృందం హామీ ఇచ్చింది. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత పోస్ట్