TG: సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసింది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, ఏకపక్ష నిర్ణయాలను అనుసరించారని ఆక్షేపించింది. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టింది. ఇది రాష్ట్ర కమిటీ చీలడానికి దారితీసిందని విమర్శించింది. తమ్మినేనితో పాటు కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, వారిచ్చిన వివరణల్లోనూ ఆత్మవిమర్శ లోపించిందంటూ అభిశంసన చర్యలు చేపట్టింది.