
మీరెందుకు మాట్లాడట్లేదు.. జనసేన నేతలపై పవన్ ఆగ్రహం
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ, కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు స్పందించడం లేదని, వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు చేయి తగిలినా అత్యాచారం చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల ట్రాప్లో చిక్కుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.




