లద్దాఖ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు

16చూసినవారు
లద్దాఖ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు
లద్దాఖ్ ప్రజల దశాబ్దాల నాటి కోరికను నెరవేరుస్తూ, కేంద్ర ప్రభుత్వం అక్కడ కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర వేయడంతో లద్దాఖ్ భౌగోళిక, పరిపాలనా ముఖచిత్రం మారిపోయింది. తాజా నిర్ణయంతో నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జన్‌స్కర్, ద్రాస్ ప్రాంతాలు కొత్త జిల్లాలుగా అవతరించాయి. జిల్లా కేంద్రాలు దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి, ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే వస్తాయి. మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ప్రణాళికలు అందడం వల్ల మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది.

సంబంధిత పోస్ట్