బాలీవుడ్‌ నటి ఇంట్లో క్రెడిట్‌కార్డ్‌ స్కామ్‌.. రూ.87వేలు మాయం

17చూసినవారు
బాలీవుడ్‌ నటి ఇంట్లో క్రెడిట్‌కార్డ్‌ స్కామ్‌.. రూ.87వేలు మాయం
బాలీవుడ్ నటి అర్చన పూరన్ సింగ్ చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేథీ ఆన్‌లైన్ క్రెడిట్ కార్డ్ మోసానికి గురయ్యారు. ఈ స్కామ్‌లో అతడు ఏకంగా రూ.87,000 కోల్పోయినట్లు అతని అన్నయ్య ఆర్యమాన్ సేథీ తన యూట్యూబ్ వ్లాగ్‌లో వెల్లడించారు. ఆయుష్మాన్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డెబిట్ అయినట్లు నోటిఫికేషన్ రావడంతో అతడు షాక్‌కు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతని క్రెడిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి ఈ లావాదేవీలు చేశారని, వెంటనే కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించి పేమెంట్లను నిలిపివేయాలని కోరామని ఆర్యమాన్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you