
SIR గడువు పెంచాలని ఈసీఐకి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR) మంగళవారంతో ముగియాల్సి ఉండగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 88 శాతం మాత్రమే పూర్తయింది. మరణించిన ఓటర్లను మినహాయిస్తే, ఇంకా 9 శాతానికి పైగా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, వివిధ రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్ల నుంచి గడువు పొడిగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, ఈ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.




