ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్కస్ స్టాయినిస్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. తన ప్రియురాలు సారా జర్నూచోతో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సారా ఇన్‌స్టాలో వెల్లడిస్తూ ఫొటోలను షేర్ చేశారు. స్టాయినిస్ ఆసీస్ తరపున 71 వన్డేలు, 74 టీ20లు ఆడారు. ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్‌లోనూ పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు.