TG: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి HYDను సెఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దామని కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి వచ్చాక సైబరాబాద్‌లో 41%, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% క్రైమ్ రేట్ పెరిగింది. కాంగ్రెస్ పాలనలో పట్టపగలే హత్యలు, దొంగతనాలు, పారిశ్రామిక వేత్తల తలకు తుపాకీ పెట్టడం చూస్తున్నాం. ముంబయి పోలీసులు వచ్చి హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుకున్నారంటే రాష్ట్రంలో హోంశాఖ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు' అని విమర్శించారు.