తెలంగాణ రాజకీయాల్లో భాషా యుద్ధం తీవ్రమైంది. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి 'నువ్వు ఎక్కడ సచ్చావు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీసులు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.