పంటలు ఎండుతున్నాయి.. చాలా బాధాకరం: జగదీష్ రెడ్డి

3చూసినవారు
TG: ప్రభుత్వ తీరుతో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఎండిపోయిన పంటలను పరిశీలించి మాట్లాడారు. 'పంటలు ఎండిన ప్రాంతంలో కూర్చొని మాట్లాడుతున్నాం.. ఇది చాలా బాధాకరం. కృష్ణాలో నీళ్లు ఉన్నా నాగార్జున సాగర్‌లో SLBC మోటార్లు ఆన్ చేయకుండా రైతులకు ఈ దుస్థితి వచ్చేలా చేశారు. మేము కూర్చున్న ప్రాంతంలో దాదాపు 400 ఎకరాలు ఇదే పరిస్థితిలో ఎండిపోయాయి. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్