ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో మహా గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాదాపు ఇవాళ ఒక్కరోజే లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలోనే బడా గణపతి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి 2 కి.మీ మేర భక్తులు క్యూ కట్టారు. వృద్ధులు, చిన్నారులు మహాగణపతి దర్శనానికి రావద్దని ఉత్సవ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. బడా గణనాథుడిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు.