అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీపై హౌతీల దాడుల నేపథ్యంలో ఇటీవల 105 డాలర్లను దాటిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర తాజాగా 97.41 డాలర్లకు చేరింది. బుధవారం(SEP30) ఉన్న రేట్లతో పోలిస్తే 6 డాలర్ల మేర తగ్గింది. ఇక WTI క్రూడ్ 89.66 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు రవాణా పెరుగుతుండటంతో ధరలు తగ్గుతున్నాయి.