TG: జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది. జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (32) అనే వ్యక్తి సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీకి తరలించి నేలపై ఉంచారు. అక్కడ భద్రత లేకపోవడంతో ఓ కుక్క లోపలికి వచ్చి మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు SMలో వైరల్ అయ్యాయి.