దారుణం.. ముగ్గురు మైనర్‌ కూతుళ్లపై తండ్రి లైంగికదాడి!

9చూసినవారు
దారుణం.. ముగ్గురు మైనర్‌ కూతుళ్లపై తండ్రి లైంగికదాడి!
మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో మద్యం మత్తులో తన ముగ్గురు మైనర్ కుమార్తెలపై గత ఏడాదిన్నర కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 14, 12, 11 ఏళ్ల బాలికలు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు వారిని అసభ్యకరంగా తాకి, ప్రైవేట్ భాగాలను తాకాల్సిందిగా బలవంతం చేసేవాడని బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాలికలకు కౌన్సిలింగ్ ఇప్పించి వారి తాతగారి సంరక్షణలో ఉంచారు.

సంబంధిత పోస్ట్